![]() |
![]() |
.jpg)
ముంబయ్‌లో ఉంటున్న హీరోయిన్లు, హీరోలకు కరెంట్ బిల్లులు చుక్కలు చూపిస్తున్నాయ్. కరెంట్ కాదు... వాళ్లకు బిల్ పట్టుకుంటేనే షాక్ గట్టిగా కొట్టేస్తోంది. నెలకు ఐదారు వేలు కరెంట్ బిల్స్ వస్తే కట్టేవాళ్లకు ఒక్కసారికి పాతిక, ముప్ఫై వేలు, లక్షలు చూసి ఖంగుతింటున్నారు. కరెంట్ సప్లయ్ చేస్తున్న అదానీ కంపెనీని గట్టిగా నిలదీస్తున్నారు.
తాప్సీకి రూ. 36 వేలు బిల్ రావడంతో కరెంట్ షాక్ కొట్టినట్టు ఉందని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. అంతకు ముందు రాధిక కుమార్తె, ‘జోష్’ హీరోయిన్ కార్తీక తన కరెంట్ బిల్ దగ్గర దగ్గర లక్ష రూపాయలు వచ్చిందని ట్వీట్ చేశారు. శ్రద్ధా దాస్‌కి రూ. 34 వేలు వచ్చిందట. తాప్సీ ట్వీట్ తరవాత మరింత మంది తమ బిల్ ఎక్కువ వచ్చిందని బయటకొచ్చారు.
బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్, రజనీకాంత్ సరసన ‘కాలా’లో చిట్టెమ్మగా నటించిన హూమా ఖురేషికి 50 వేల రూపాయల కరెంట్ బిల్ వచ్చిందట. ‘‘లాస్ట్ మంత్ 6 వేల రూపాయల కరెంట్ బిల్ కట్టాను. ఈ మంత్ 50 వేల రూపాయల కరెంట్ బిల్ వచ్చింది’’ అని ఆమె పేర్కొన్నారు. మరో హీరోయిన్ అమైరా దస్తూర్ సైతం కరెంట్ బిల్ మీద మండిపడ్డారు. ఏప్రిల్ 1 నుండి ఫ్లాట్‌లో లేకున్నా బిల్ భారీగా పంపించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణుకా సహానే, డినో మోరియా, వీర్ దాస్ సైతం కరెంట్ కంపెనీలు భారీగా వడ్డించిన బిల్స్‌కి బాధితులే.
![]() |
![]() |